ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్: కార్యకర్తల ప్రాంత అభ్యాస వర్గ

గుంటూరు, అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల ప్రాంత అభ్యాస వర్గ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 15 జిల్లాల నుంచి 126 మంది ప్రతినిధులు , వైద్యులు, ఆయుర్వేద, హోమియోపతి, యునాని నిపుణులు ఈ సమావేశంలో చురుకుగా పాల్గొన్నారు. మంత్రి పాల్గొన్న సభలో 250 మంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులు

  • డా. అశోక్ కుమార్, జాతీయ సంఘటన కార్యదర్శి,
  • డా. మురళీకృష్ణ, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి, చెన్నై
  • డా. పి.యస్. రావు, రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి
  • డా. కే.ఎస్.యన్. చారి, సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు
  • శ్రీ. కుమారస్వామి, క్షేత్ర సంయోజకులు
  • డా. కాకాని పృథ్వీరాజు, ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ సంఘటనా కార్యదర్శి

ఆరోగ్య భారతి: 25 ఏళ్ల సేవా యాత్ర

ఆరోగ్య భారతి భారతదేశంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరియు దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 600 మంది సభ్యులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ‘ఆరోగ్య జీవన విధానం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు మరియు గుంటూరులోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులను సన్మానించారు.

మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు

మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “ఆరోగ్య భారతి కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది. దేశంలో 92% జిల్లాల్లో మన కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో స్వచ్ఛ జలం, ఆరోగ్య రక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 2030 నాటికి హెర్బల్ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుంది,” అని తెలిపారు.

ఆయన రాష్ట్రంలోని ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ, “2023లో 73% క్యాన్సర్ కేసులకు ఆహార లోపాలు కారణం. గోదావరి, నెల్లూరు జిల్లాల్లో డయాబెటిస్, రాయలసీమలో హైపర్‌టెన్షన్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూత్రపిండాలు, లివర్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. 2025 నుంచి 2047 వరకు యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల మరణాలు పెరిగే అవకాశం ఉంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోగ్య భారతి కార్యక్రమాలు

డా. అశోక్ కుమార్ మాట్లాడుతూ, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, ఆరోగ్య మిత్ర, స్వస్థ గ్రామ యోజన వంటి కార్యక్రమాలు ఈశాన్య రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశం వరకు విస్తరించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 100కు పైగా పాఠశాలల్లో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, గుంటూరు జిల్లా తూములురులో 10 క్లస్టర్ గ్రామాల్లో స్వస్థ గ్రామ యోజన అమలవుతోంది. మహిళల కోసం ఆరోగ్య శిబిరాలు, గృహ వైద్యం, ఔషధ మొక్కలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది 6,830 మంది సూర్యనమస్కార పోటీల్లో, 20,066 మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైజాగ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు సాధించింది.

రాష్ట్రంలో ఆరోగ్య సేవలు

మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “4 కోట్ల మందికి స్క్రీనింగ్ టెస్టులు, 40 లక్షల మంది డయాబెటిస్ రోగులు, 30 లక్షల మంది హైపర్‌టెన్షన్ బాధితులు ఉన్నారు. 30% మరణాలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల సంభవిస్తున్నాయి. నివారణే ప్రధాన మార్గం,” అని పేర్కొన్నారు. ప్రైవేట్ వైద్యులు వారంలో ఒక రోజు ఉచిత శస్త్రచికిత్సలు చేయాలని, ఆరోగ్య భారతి స్ఫూర్తిగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 47,000 రూపాయల విలువైన స్ట్రోక్ ఇంజెక్షన్‌ను 3,800 మందికి ఉచితంగా అందించారు. గుంటూరులో డా. గోపాలకృష్ణ 110 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు. ఆయుష్ ఆసుపత్రుల అభివృద్ధికి 85 కోట్ల రూపాయలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆయుష్ నిధులను వినియోగించకుండా నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

యోగా మరియు జీవనశైలి

మంత్రి యాదవ్ యోగా ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, “స్వచ్ఛంద జీవనానికి యోగా ఒక్కటే మార్గం. జీవనశైలి మార్పుల ద్వారా వ్యాధులను నివారించవచ్చు,” అని అన్నారు. ఆరోగ్య భారతి సంస్థతో కలిసి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

శ్రీ రామశర్మ గారు, ఆరోగ్య  భారటి ప్రాంత  కార్యదర్శి మాట్లాడుతూ,
ఆరోగ్య భారతీ అనేది సమాజానికి సేవలందించేందుకు ఏర్పడిన ఒక విశిష్టమైన సంస్థ అని తెలిపారు. ఇది వివిధ వైద్య విధానాలలో నిపుణులైన వైద్యులు, అలాగే సేవా భావన కలిగిన వ్యక్తుల సమాఖ్యగా పనిచేస్తోంది. ఆరోగ్య సంరక్షణ (Positive Health), ఆరోగ్య సంవృద్ధి (Promotive Health), రోగనిరోధక ఆరోగ్యం (Preventive Health) లక్ష్యంగా స్వస్థమైన సమాజ నిర్మాణం వైపు ముందడుగులు వేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఆరోగ్య భారతీ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ (School Health Programme) అమలవుతున్నది. విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, సీపీఆర్‌ (CPR) పై శిక్షణ వంటి కార్యక్రమాలు సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించబడుతున్నాయి.

అలాగే, గుంటూరు జిల్లాలో తూములూరు గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని 10 క్లస్టర్ గ్రామాల్లో “స్వస్థ గ్రామ యోజన” విజయవంతంగా అమలవుతోంది. ఈ యోజన ద్వారా గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి.

మహిళల ఆరోగ్య చైతన్యం కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. గృహ వైద్యం, సులభమైన ఆయుర్వేద చికిత్సలు, ఔషధ మొక్కలపై అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సంవత్సరం 6830 మంది విద్యార్థులు సూర్యనమస్కార పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేగాక, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 101 ప్రదేశాల్లో నిర్వహించిన యోగ కార్యక్రమాలలో మొత్తం 20,066 మంది పాల్గొనడం విశేషం.

ప్రాంత కమిటి లో కొత్త గా చే రిన  2 సభ్యులు

ప్రాంత కమిటీలో కొత్తగా చేరిన ఇద్దరూ సభ్యులు విశాఖ నుండి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రముఖ కార్డియాలజిస్ట్,   కర్నూలు నుండి శ్రీ మోక్షశ్వరుడు వీరిద్దరూ ఇకనుండి ప్రాంత కమిటీలో సభ్యులుగా ఉంటారు

ముగింపు

కార్యక్రమం శ్రీ శంకర్ రెడ్డి వందన సమర్పణతో ముగిసింది. ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ సేవా కార్యక్రమాలు, ప్రజల ఆరోగ్య చైతన్యం కోసం చేపడుతున్న కృషి రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి నూతన దిశను అందిస్తోంది.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top