గుంటూరు, ఏప్రిల్ 5:
శ్రీరామ నవమి సందర్భంగా గుంటూరులో హిందూ సంఘాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ సందర్భంగా ర్యాలీ మరియు భారీ రథయాత్ర నిర్వహించేందుకు అన్ని హిందూ సంస్థలు ఘన సన్నాహాలు చేపట్టాయి.
ఉదయం 9 గంటలకు బ్రిందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం గుంటూరు నగరంలోని ప్రధాన వీధులగుండా ఈ ర్యాలీ కొనసాగనుంది.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గుంటూరులోని అన్ని కేంద్రాలను కాషాయ ధ్వజాలతో శోభాయమానంగా అలంకరించారు. గలగల మ్రోగుతున్న హిందూ ధర్మస్పూర్తి నినాదాలతో నగరం మార్మోగుతున్నది .
సాంస్కృతిక ప్రదర్శనలు, కొలాటము ,భజన పాటలు, విగ్రహ మూర్తుల ఊరేగింపులు ఈ ర్యాలీని ప్రత్యేకంగా మలచనున్నాయి. ప్రజలలో ధర్మజాగరణ కలిగించేలా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
పోలీసులు కూడా భారీ భద్రతా చర్యలు చేపట్టి ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీలో భాగంగా పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
జై శ్రీరామ్ నినాదాలతో గుంటూరు నగరం శ్రీరామ భక్తి వాతావరణంతో నిండిపోనుంది.