గుంటూరు: ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఈరోజు నూతక్కిలోని మాతృచాయా నిరాశ్రిత బాలుర ఆవాసంలో విద్యార్థులకు దంత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరానికి గుంటూరు నుంచి డాక్టర్ వాడపల్లి వైజయంతి విచ్చేసి బాలురకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందించారు. ఆమెకు సహాయంగా ఆమె భర్త శశి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీరాజు పాల్గొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం 9వ తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వారి సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థుల అకడమిక్ ప్రగతి, చదువులో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వారికి అవసరమైన విద్యా మార్గదర్శకత్వం మరియు కౌన్సెలింగ్ అందించారు.

ఆరోగ్యంతో పాటు విద్యలోనూ విద్యార్థులు ముందుకు సాగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ఆరోగ్య భారతి – ఆరోగ్యమే మహాభాగ్యం | సేవే మా లక్ష్యం
