మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు  – భారతీయం తెలుగు వార్తలు

కేంద్రం చర్చలకు తిరస్కారం చెప్పడంతో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి తన 60 మంది కేడర్‌తో లొంగిపోయారు. అదే తరహాలో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేష్ కూడా జనజీవన స్రవంతిలో కలిశారు.

ఈ రెండు రోజులలో ముగ్గురు డివిజన్ కార్యదర్శులు, ఐదుగురు దండకారణ్య జోనల్ కమిటీ సభ్యులు, 20 మంది డివిసి సభ్యులు సహా మొత్తం 169 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ CM విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో జగదల్‌పుర్‌లో అధికారిక లొంగుబాటు జరగనుంది. 70కి పైగా ఆయుధాలను అప్పగించబోతున్నారని సమాచారం.

లొంగుబాటులో భావోద్వేగ సందేశం

క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామని ఆశన్న పేర్కొంటూ, తన సహచరులు కూడా తమ భద్రత కోసం లొంగుబాటు పథంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “అడవుల్లో ఇంకా పోరాడేవారు కూడా నాకు సంప్రదించండి,”అన్నారు.

ఆశన్న జీవిత కథ

ఆశన్న, ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందినవారు. ITI, పాలిటెక్నిక్ చదివారు. 1991లో పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. 1999లో యాక్షన్ టీంను నాయకత్వం వహించారు. హైదరాబాద్‌లో IPS అధికారి ఉమేష్ చంద్రను హత్య చేసిన ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. 2000లో రాష్ట్ర హోంమంత్రి ఎ మాధవరెడ్డి, 2003లో సీఎం చంద్రబాబు కాన్వాయ్‌పై ఆయనే దాడి చేశారు. తద్వారా ఆశన్న పేరు మావోయిస్టు ఉద్యమంలో ప్రముఖంగా నిలిచింది.

కేంద్ర హోంమంత్రివర్గ ప్రకటన

మావోయిస్టు నేతల లొంగుబాటు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, “ఇది నక్సలిజం పై పోరులో చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు,”అని అన్నారు. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి తమ కట్టుబాటు అన్నారు.

ప్రత్యక్ష ఘట్టాలకు సంబంధించిన సూచన

చెత్తీస్‌గఢ్‌లో BJP ప్రభుత్వం వచ్చిన తరువాత జనవరి 2024 నుంచి 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1,785 మందిని అరెస్టు చేశారు. 477 మంది ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

*డాక్టర్ కాకాని పృథ్వీ రాజు*

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి