నరకాసురుడు భూమి దేవి (భూమాత) గారికి మరియు విష్ణుమూర్తి అవతారం అయిన వరాహ స్వామికు పుత్రుడు. ఒకసారి భూమి దేవి తన పుత్రుడు  మహాశక్తివంతుడైన రాజును కావాలనే కోరికతో విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణువు ఆమె కోరికను అంగీకరించి, తన వరాహ అవతారంలో ఆమెతో సాన్నిధ్యం పొందాడు. ఆ సాన్నిధ్యం ఫలితంగా భూమాత గర్భం ద్వారా నరకాసురుడు జన్మించాడు.

ధర్మమార్గాన్ని విడిచి, స్వార్థం, అహంకారం, మొహం, కామం తో దేవతలను, ఋషులను, స్త్రీలను , సామాన్య  ప్రజలను  హింసించే వాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి దిగి, నరకాసురుడిని సంహరించాడు—అది అధర్మం పై ధర్మం  విజయం సాధించిన క్షణం.

ఇప్పుడు, కలియుగంలోనూ నరకాసురుడు చనిపోలేదు. ఆయన రూపం మారింది — మనలోని చెడుప్రవర్తనల్లో దాగి ఉన్నాడు. లోభం, అవినీతి, అసహనం, నకిలీ వార్తలు, సైబర్ దోపిడీ, మహిళాపై హింస, ప్రకృతిని నాశనం చేయడం, మాదక ద్రవ్యాలు  వంటి రూపాల్లో నేటి నరకాసురుడు మళ్లీ మోకరిల్లుతున్నాడు. ప్రజల మనసులు చీకటిలో మునిగి పోవడానికి నేర్పుతున్నాడు.

ఈ కాలంలో శ్రీకృష్ణుడి వధమంటే ఓ కొత్త అర్థం వచ్చింది — ఆయుధాలతో కాదు, నిజాయితీతో, దేశభక్తి, క్రమశిక్షణ, సమరసత, పర్యావరణ హితం ,సహానుభూతితో, ధర్మపరమైన నిర్ణయాలతో ఈ నరకాసురులను జయించాల్సిన సమయం వచ్చింది. సత్యభామగా మన సమాజంలోని మహిళలు స్వయంగా ఎదిగి నీచత్వాన్ని అణగదీయాలి; కృష్ణునిగా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లను  జయించి వెలుగు నింపాలి.

దీపావళి ఆత్మార్థం కూడా ఇదే — వెలుగుల పండుగ కేవలం దీపముల కాంతి కోసం కాదు, మన చుట్టూ ఉన్న నరకాసుర రూపపు చీకట్లను తరిమివేయడానికి. ప్రతి ఒక్కరూ ధర్మం , సత్యం, ధర్మం, మానవత్వం, దేశభక్తి అనే ఆయుధాలతో నరకాసురుని మరల నశింప జేయాలి.

జై హింద్ ! జై భారత్!

*డా. కాకాని పృథ్వీ రాజు*

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *