గుంటూరు ఎన్జిఓ కాలనీ లోహిందూ సమ్మేళనం

స్థానిక  ఎన్జీవో కాలనీలోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. హిందూ బంధువులు ఒక 1050 మంది దాకా పాల్గొన్నారు. దీనికి ప్రముఖంగా శ్రీ స్వామీజీ మెళ్ళ చెరువు సుబ్రమణ్య  శర్మ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీమతి యామిని శర్మ గారు. , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ మీడియా విభాగ ఇంచార్జ్ వారు శ్రీనివాస్ గారు.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ   విభాగ్ భౌధ్ధిక్ ప్రముఖ కలగా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. మొదటగా శ్రీ శ్రీ పూజ్య స్వామీజీ శర్మ గారు మాట్లాడుతూ హిందూ సమాజం ఈరోజు ఐక్యతగా ఉండవలసిన అవసరం గురించి దాని విశిష్టత గురించి తెలియజేస్తూ అనేక విషయాలను చెప్పారు.

శ్రీమతి యామిని శర్మ గారు మాట్లాడుతూ హిందూ సమాజంలో ఉండే వివక్షతలను మనం తొలగించి అందరూ సామరస్యంతో సమానంగా సంఘీ భావంతో లేకపోతే మనం చాలా ఇబ్బందులకు, నష్టాలకు, కష్టాలకు గురికావాల్సి  వస్తుందని కాబట్టి అందరూ ఐక్యంగా ఉండాలి అన్నారు. మనం కులం మన ఇంట్లోనే ఉంచుకొని గడప దాటిన తర్వాత అందరం హిందువులం అనే భావనతో వ్యవహరించాలని తెలియజేశారు. అట్లానే కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా కుటుంబ విలువలు తమ తరాల వరకు వచ్చే తరాలకు తెలియజేయాలని అందులో మహిళలు ఎంతో జాగ్రత్తగా కుటుంబాన్ని సరిదిద్దుకోవలసిన అవసరం ఎంతో ఉందని తెలియజేశారు.

తర్వాత అవ్వారు  శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అనేక పరిస్థితుల గురించి వివరించారు. నేడు హిందూ సమాజం మేల్కొనకపోతే మనమే బాధపడాల్సి వస్తుందని అటు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇక్కడ స్థానికంగా వచ్చే సమస్యలను గురి చేస్తున్న వారి  పట్ల మనం శ్రద్ధ వహించాలని, మన అనువంశికంగా వస్తున్న కులవృత్తులకు దెబ్బ తగిలే విధంగా అన్యులు ఈ కులవృత్తుల్లోకి చొరబడారని మంగలి  షాపు దగ్గర నుంచి ఆటో రిక్షాల దగ్గర నుంచి పూలు పండ్లు దగ్గర నుంచి అన్నీ కులపరంగా చేసేటువంటి వృత్తుల్లో వాళ్ళు చొరబడి హిందువులకు స్థానం లేకుండా చేస్తున్నారు . ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించి మనం ఐకమత్యంతో వ్యవహరించాలని లేకపోతే మన కులవృత్తులే కాకుండా మన జనాభా వ్యవస్థ కూడా దెబ్బతింటుందని తెలియజేశారు. అట్లానే జిహాదీల పట్ల మనం శ్రద్ధతో ఉండాలని లవ్ జిహాదీ పేరుతోటి బాలికలనే కాకుండా మహిళల్ని కూడా ఎరవేసి వాళ్ళు వశం చేసుకుంటున్నారని. పానీయంలో మత్తుమందు కలిపి వశీకరణ మంత్రం ద్వారా మహిళల్ని లోబరుచుకుంటున్నారని ఈ విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండి తన కుటుంబాలని తానే కాపాడుకోవాలని తెలియజేశారు. అనేకమంది సమాజ పెద్దలు ప్రసంగించారు, వారిలో  విజేత స్కూలు  చెరుకూరి శ్రీహరి గారు, ఆడకా శ్రీను, యోగి మహేశ్వరానంద,

 బాల స్వామి, శైలజమ్మ, చావల కోటేశ్వరరావు అట్లానే అడప శ్రీనివాస్ గారు  తమ ప్రసంగాల్ని తెలియజేశారు.  మహిళలు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా పిల్లలకు తాము. తెలియజేయాలని లేకపోతే మనం దేవాలయంలోకి వెళ్తున్నామా క్లబ్బుకు వెళ్తున్నామా అనే వ్యత్యాసం లేకుండా పిల్లలు పెరుగుతున్నారని దాని పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని మనం మాట్లాడే పద్ధతి మన నడవడి. మనం వేసుకునేటువంటి వేషం కూడా తగినట్లుగా ఉండాలని వారు తెలియజేశారు. చివరిగా శ్రీ కలగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలుగా హిందూ సమాజం కోసం చేస్తున్నటువంటి కృషిని విజయం సాధించినటువంటి అనేక విషయాల్ని ప్రస్తావించారు. మన దేశంలోనే కాకుండా 45 దేశాల్లో హిందూ స్వయంసేవక్ సంఘ్ విస్తరిస్తున్నదని హిందూ సమాజం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎక్కడైతే బలంగా ఉందో ఎక్కడైతే శాఖలు ఉన్నాయో అక్కడ హిందూ సమాజం 100 కి 100 శాతం రక్షింపబడుతున్నదని అట్లానే శాఖలు ఎక్కడైతే లేవు హిందువుల పరిస్థితి చాలా దుర్భరంగా బలహీనంగా ఉందని. అలానే మనం ఇప్పుడు నేడు చూస్తున్నాం కాశ్మీర్ గానీ, అస్సాంలో గానీ, వెస్ట్ బెంగాల్ లో కానీ ఎక్కడైతే హిందూ జనాభా తక్కువగా ఉన్నదో అక్కడ వారి మీద దాడి దౌర్జన్యం జరుగుతున్నదని ఎక్కడైతే సంఘ శాఖలు ఉన్నాయో కేరళ లాంటి ప్రదేశంలో హిందూ సమాజం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ వారికి పూర్తి రక్షణ కలుగుతున్నదని. కాబట్టి మనమంతా గుర్తుంచుకోవాల్సింది మనం మనం రక్షించుకోవాలంటే సంఘ శాఖలను విస్తరింపచేయాలి. సంఘం బలంగా ఉన్నప్పుడు సమాజం రక్షింపబడుతుందని తెలియజేశారు. అట్లానే అనేక విషయాల పట్ల మనం శ్రద్ధ వహించి ఐకమత్యంగా ఉంచి సంఘీభావంతో ఉంటే ఈ సమాజం సురక్షితంగా ఉంటుందని శ్రీనివాసరావు గారు తెలియజేశారు.

మధ్యలో క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది చిన్న చిన్న బాలికలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏకపాత్రాభినయం భరతనాట్యము చేసి సూపర్లకు ఆకట్టుకునే విధంగా ప్రయత్నం జరిగింది. చివర్లో అందరికీ సత్కారంతోటి ధన్యవాదాలతోటి ఈ కార్యక్రమం పూర్తయింది. డాక్టర్ రాధాకృష్ణ అంకరాజు రాధాకృష్ణ గారు, శ్రీ నాగేశ్వరరావు గారు, ఏ.వి. రమణమూర్తి గారు వీరు వేదికని నిర్వహించారు. అంకయ్య గారు శేషాంక పబ్లిసిటీ వ్యవహారాన్ని చూశారు. నిరంజన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అనేకమంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top