30 నవంబర్ 2025 బాపట్ల:

 ధన్వంతరి జయంతి వేడుకల సందర్భంగా ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో బాపట్లలో ఆరోగ్య జీవనశైలి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య భారతీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీరాజ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బాపట్ల జిల్లా ప్రచారక్ శ్రీ వాకాటి భాను హాజరై కార్యక్రమాన్ని నడిపించారు. మొదటగా ధన్వంతరి ప్రార్ధనతో కార్యక్రమం ప్రారంభించగా డా పృథ్వీ రాజు ధన్వంతరి దైవం ఆవిర్భావ వివరాలను తెలియ చేశారు

పలువురు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ—
ఈరోజు ఎక్కువగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యల్లో చాలా భాగం  జీవనశైలి లో మార్పు , ఆహార నియమాల లోపం, మానసిక ఒత్తిడి, కోరికలపై నియంత్రణ లేకపోవడం వల్లే ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం—

  • ఆహార నియమాలు పాటించడం
  • మానసిక ప్రశాంతతను పెంపొందించడం
  • వ్యాయామం చేయడం
  • తగిన నిద్ర తీసుకోవడం
  • ప్రాణాయామం, యోగ , ద్యానం

వంటి అలవాట్లు అత్యంత కీలకమని చెప్పారు.

ఆయన వివరించిన ముఖ్యాంశాలు:

👉 ఆహారం శ్రమ ఆధారంగా తీసుకోవాలి.
👉 తిన్న తర్వాత కనీసం 3 గంటలు గడిచే వరకు మళ్లీ ఆహారం తీసుకోరాదు.
👉 6 గంటలకు మించి ఆహార విరామం ఉండకూడదు.
👉 వండిన ఆహారాన్ని 3 గంటల తర్వాత తిరిగి వేడి చేసి తీసుకుంటే పోషక విలువలు తగ్గిపోతాయి.
👉 సరైన సమతుల్య ఆహారం శరీరానికి బలం, వ్యాధి నిరోధక శక్తిని  అందిస్తుంది.

ఆరోగ్యభారతి – సమాజంలో ఆరోగ్యజీవన విధానాలు వ్యాప్తి చేస్తూ, ఆరోగ్య సమస్యలను ఆసుపత్రుల దాకా వెళ్లకుండా నివారించే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

శ్రీ వాకాటి భాను మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భం గా సమాజం లో పంచ పరివర్తన తీసుకోచ్చే దిశగా పనిచేస్తున్నదని, సమరసత, స్వదేశీ, పౌర విధులు, పర్యావరణం, కుటుంబ సంస్కారాలు పునరుద్ధ్ధరించే దిశగా పనిచేస్తున్నది   మీరు కూడా ఈ కార్యక్రమం లో భాగస్వాములు కావాలని శ్రీ భాను కోరారు.

చివరగా, డాక్టర్ శ్రీనివాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ—రాబోయే రోజుల్లో ఆరోగ్యభారతి కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించి సేవ చేస్తానని  ప్రకటించారు.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *