ఒంగోలు 29 నవంబర్ 2025:

 ఆరోగ్య భారతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఆంధ్ర కేసరి విద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీ రాజు ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ శ్రీ చెంచు రామయ్య, ప్రిన్సిపల్ కారుమూడి రామిరెడ్డి, పలువురు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మొత్తం 220 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యంపై ముఖ్యమైన సమాచారం తెలుసుకున్నారు.

డాక్టర్ పృథ్వీరాజు మాట్లాడుతూ—
జీవనశైలిలో చిన్న మార్పుల ద్వారా చాలా అనారోగ్యాలను నివారించవచ్చని, ఆసుపత్రుల పాలవకుండా ఉండటం మన చేతుల్లోనే ఉందని వివరించారు. ప్రస్తుతం ఎక్కువ జబ్బులు జీవనశైలి లోపాల వల్లే వస్తాయని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని చెప్పారు.

 భౌతిక ఆరోగ్యం తో పాటు మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యము కూడ ఎంతో అవరమని dani ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
బయట తినే ఆహారం నుండి దూరంగా ఉండాలని సూచిస్తూ—ఆహారాన్ని అధిక వేడి మీద వండడం వల్ల పోషక విలువలు నశిస్తాయని, దాంతో ఒబేసిటీ, షుగర్, బీపీ వంటి సమస్యలు చిన్న వయసులోనే రావచ్చని హెచ్చరించారు.

ఆరోగ్యకరమైన జీవనపద్ధతులు అలవర్చుకుంటే మనస్సు ప్రశాంతత, ఏకాగ్రత, గ్రహణశక్తి, ధారణశక్తి పెరుగుతాయని విద్యార్థులకు డాక్టర్ పృథ్వీరాజు చెప్పారు.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *