Preloader

సేవా భారతి, ఆరోగ్య భారతి ద్వారా గుంటూరులో విశేష సేవలు.. డాక్టర్ దివి హరిప్రసాద్ సేవలను స్మరించుకున్న వక్తలు

గుంటూరు, ఆగస్టు 9:
గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో మూడు రోజులుగా జరుగుతున్న బీ2 ఎక్స్పో–2026 చివరి రోజు కార్యక్రమాలు వినూత్నంగా సాగాయి. వ్యాపార ప్రదర్శనలు, పారిశ్రామిక చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా.. సమాజ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం ద్వారా బీ2 ఎక్స్పో నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆగస్టు 7, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ ఎక్స్పో చివరి రోజు కార్యక్రమం అధ్యక్షుడు శ్రీ కొమ్మమూరు శ్రీధర్, కార్యదర్శి శ్రీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.

సేవామూర్తి డాక్టర్ దివి హరిప్రసాద్‌కు ఘన నివాళి

మూడో రోజు కార్యక్రమంలో ప్రముఖంగా డాక్టర్ దివి హరిప్రసాద్ సేవలను స్మరించుకున్నారు. గుంటూరు జిల్లాలో సేవా కార్యక్రమాలకు విశేష కృషి చేసిన ఆయనను స్మరించుకుంటూ పలువురు వక్తలు ఆయనతో తమ అనుబంధాన్ని, ఆయన చేసిన సేవలను సభాముఖంగా వివరించారు.

గుంటూరు జిల్లాలో సేవా భారతి ద్వారా డాక్టర్ దివి హరిప్రసాద్ అనేక సేవా కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించారని వక్తలు పేర్కొన్నారు. అన్నదానం, తాగునీటి సరఫరా, పేదలు నివసించే ప్రాంతాల్లో విద్యా కార్యక్రమాలు, కంప్యూటర్ శిక్షణ వంటి అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

సేవా కార్యక్రమాలను కేవలం నిర్వహించడమే కాకుండా.. వాటిని నిరంతర కార్యక్రమాలుగా తీర్చిదిద్ది సేవా భారతి కార్యకలాపాలకు గుంటూరులో బలమైన పునాది వేశారని పేర్కొన్నారు.

అనంతరం ఆయన ఆరోగ్య భారతి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించి, ఆరోగ్య అవగాహన, ప్రజారోగ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేశారని వక్తలు గుర్తుచేశారు.

సేవ అంటే జీవితాన్ని సమాజానికి అంకితం చేయడం”


ఈ సందర్భంగా డాక్టర్ కాకాని పృథ్వీరాజు మాట్లాడుతూ డాక్టర్ దివి హరిప్రసాద్ చేసిన సేవలను వివరించారు. సమాజం నుంచి పొందిన దానిని తిరిగి సమాజానికే అందించాలనే తపనతో పనిచేసిన వ్యక్తుల సేవలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సేవా కార్యక్రమాలు కేవలం ఒక సంస్థకు లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం కాకుండా.. సమాజంలో మరింత మంది సేవా భావంతో ముందుకు వచ్చేలా స్ఫూర్తినివ్వాలని ఆయన అన్నారు.

ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన సేవలను గుర్తుచేసుకోవడం అంటే కేవలం గతాన్ని స్మరించుకోవడం కాదని, అలాంటి సేవా మార్గాన్ని భవిష్యత్ తరాలకు చూపించడమేనని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా డాక్టర్ విజయభాస్కర్

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కీళ్లు, ఎముకల వ్యాధుల నిపుణులు, శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ హాజరయ్యారు. సమాజానికి సేవ చేసిన వ్యక్తులను స్మరించుకునే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే జీఎస్టీ అడ్వకేట్ శ్రీ సుందర్ రామచంద్ర శర్మ, ప్రముఖ సామాజిక విశ్లేషకు బైరిసెట్టి మల్లికార్జున రావు, శ్రీ రవిశంకర్, బీ2 ఎక్స్పో కన్వీనర్ అండ్ చైర్మన్ శ్రీ సాయి, ఆయుర్వేద క్లినిక్ ప్రతినిధులు, శ్రీ జయరాం, దివి హరిప్రసాద్ కుమారులు దివి జయరాం, ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆరోగ్య భారతి సేవలపై అవగాహన

ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ సీతారామ కిషోర్ ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం కల్పించడం, సమాజంలోని వివిధ వర్గాలకు ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో సంస్థ చేస్తున్న కృషిని వివరించారు.

సేవామూర్తులకు ఘన సత్కారం

కార్యక్రమం ముగింపులో సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషించిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు.

బైర్శెట్టి మల్లికార్జునరావు, డాక్టర్ దీవి జయరాం , సుందర్ రామచంద్ర శర్మలను సభాముఖంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బైర్శెట్టి మల్లికార్జునరావు మాట్లాడుతూ డాక్టర్ దివి హరిప్రసాద్‌తో తనకున్న పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవా భావం, సమాజం పట్ల ఉన్న నిబద్ధతను కొనియాడారు.

వ్యాపారానికి వేదిక.. సేవకు విలువ

మూడు రోజుల బీ2 ఎక్స్పో ముగింపు రోజున నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారం, పారిశ్రామిక అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నిర్వాహకులు చాటిచెప్పారు.

వ్యాపార విజయాన్ని మాత్రమే కాకుండా.. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన కూడా పారిశ్రామికవేత్తలు, యువతలో పెరగాలని ఈ కార్యక్రమం సందేశాన్ని అందించింది.

బీ2 ఎక్స్పో చివరి రోజు సేవామూర్తుల స్మరణతో ముగియడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.

జై హింద్.. జై భారత్!

11 / 100 SEO Score
Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *