దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్ ద్వారా క్యాడర్‌కు శిక్షణ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్థాయికి మరింతగా విస్తరిస్తూ, “దీన్ దయాళ్ ప్రాశిక్షణ అభియాన్” ద్వారా పార్టీ కార్యకర్తలకు విస్తృత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. మాధవ్ నాయకత్వంలో ఈ శిక్షణా శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్నాయి.

ఇటీవల గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ శిక్షణా వర్గాలు నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమంలో ప్రాథమిక స్థాయి క్యాడర్‌కు వివిధ ముఖ్య అంశాలపై నిపుణులు శిక్షణ అందించారు.

శిక్షణలో భాగంగా మాట్లాడిన వక్తలు మరియు వారి అంశాలు:

  • శ్రీ కాకాని పృథ్విరాజ్ గారు – సైద్ధాంతిక పునాది
  • శ్రీ పిరోజ్ ఖాన్ గారు – సోషల్ మీడియా, SARAL యాప్, నమో యాప్
  • శ్రీ ఈదర రఘువీర రెడ్డి గారు – చరిత్ర, వారసత్వం, విశ్వాసం
  • శ్రీ జంధ్యాల రామలింగ శాస్త్రి గారు – కార్య పద్ధతి
  • శ్రీ కంతేటి బ్రహ్మయ్య గారు – ప్రభుత్వ విజయాలు, ప్రభావాలు
  • శ్రీ చెరుకూరి విజయ భాస్కర్ రెడ్డి గారు – కార్య వ్యూహరచన & బూత్ మేనేజ్‌మెంట్
  • శ్రీమతి నడ్డి నాగమల్లేశ్వరి గారు – మన్ కీ బాత్, చేరువ, జనతా దర్బార్, మన ఊరు – మన జెండా

ఈ ప్రాశిక్షణ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విధానాలు, బూత్ మేనేజ్‌మెంట్, ప్రభుత్వ పథకాల అమలు విధానం, SARAL యాప్ వినియోగం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్తను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ శిక్షణల ద్వారా కార్యకర్తలు ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేయడం, ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో సమర్థవంతంగా పనిచేయడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నారు.

పార్టీ నాయకులు పేర్కొన్నదాని ప్రకారం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను ఆధారంగా తీసుకొని సేవా భావంతో కూడిన రాజకీయ కార్యకర్తలను తీర్చిదిద్దడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామాల లోతుల్లోకి చొచ్చుకెళ్లే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు బీజేపీకి బలమైన పునాది వేస్తున్నాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో ఈ శిక్షణా కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తలను సిద్ధం చేయాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *