స్నేహ పరిమళం నిర్వాహక సభ్యుల సమావేశం

గుంటూరులోని బ్రాడీపేట సమితి  హాల్‌లో స్నేహ పరిమళం నిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి గుంటూరులో ఉన్న స్నేహ పరిమళం ఆర్గనైజర్స్‌లో మొత్తం 11 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాన్‌బ్యాక్సీ కంపెనీలో 25 సంవత్సరాల సేవ పూర్తి చేసిన టి.ఆర్. రమేష్ గారిని మరోసారి ఘనంగా సన్మానించారు. స్నేహ పరిమళం కార్యక్రమం జరిగిన రోజున ఇచ్చిన మొమెంటోపై స్టిక్కర్ లేకపోవడంతో, ఈరోజు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి మరోసారి మొమెంటో అందజేసి సత్కరించారు.

అదే విధంగా, రాన్‌బ్యాక్సీ కంపెనీకి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్స్ మరియు స్నేహ పరిమళం సభ్యులు స్పందించి పవన్ కుమార్‌కు అందజేసిన ఆర్థిక సహాయంపై సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు.  స్నేహ పరిమళం సభ్యులు  నిధిని సేకరించి వరంగల్ మెడికల్ రెప్రెసెంటేటివ్ పవన్ కుమార్ కి  89 వేల రూపాయల నగదు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం అందించినందుకు హర్షం తెలియ చేశారు. ఈ సహాయ కార్యక్రమాన్ని అభినందిస్తూ సభ్యులు  తమ సంఘీభావాన్ని తెలిపారు.

ఇంకా, పవన్ కుమార్ కుమార్తె ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నట్లు తెలియజేశారు. ఆమె భవిష్యత్ విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల విషయంలో కూడా స్నేహ పరిమళం సభ్యులు ముందుండి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడదామని, అలాగే స్నేహ పరిమళం కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top