ఈరోజు గుంటూరు లోని SRMO ఓరియెంటల్ హై స్కూల్‌లో ఆరోగ్య భారతీ గుంటూరు యూనిట్ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు.

కార్యక్రమానికి డా. ఎం. శ్రీనివాస రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 120 మంది విద్యార్థులు (ఆబ్బాయిలు మరియు అమ్మాయిలు) ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రారంభంలో విద్యార్థులందరూ కలిసి ధన్వంతరి పూజ నిర్వహించారు. అనంతరం డా. శ్రీనివాస రెడ్డి గారు ధన్వంతరి జన్మకథ, ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరించారు.

కార్యక్రమంలో డా. సీతారాం కిశోర్ గారు కూడా పాల్గొన్నారు.

తరువాత విద్యార్థులకు యోగాభ్యాసాలపై ప్రత్యక్ష శిక్షణ ఇవ్వబడింది. శారీరక-మానసిక ఆరోగ్య రక్షణలో యోగా ప్రాధాన్యతను డా. శ్రీనివాస రెడ్డి వివరించారు.

ఆరోగ్య భారతీ గుంటూరు యూనిట్ ప్రతినిధులు మాట్లాడుతూ—
ఏడాదిలో ప్రతి నెలా ఒకసారి స్కూల్ హెల్త్ క్లాస్ నిర్వహించి, క్రింది అంశాలపై శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు:

  • ఆరోగ్యకర జీవనశైలి (Healthy Lifestyle)
  • యోగా & ధ్యానం (Yoga & Meditation)
  • సీపీఆర్ శిక్షణ (CPR)
  • ఫస్ట్ ఎయిడ్
  • గృహవైద్యం (Home Remedies)
  • పర్యావరణ పరిరక్షణ (Environment Awareness)
  • స్వచ్చ భారత్ (Cleanliness & Hygiene)

అదనంగా, శిక్షణ పొందిన విద్యార్థులు తమ కుటుంబానికి, సమాజానికి ఈ జ్ఞానాన్ని పంచి స్వస్థ వ్యక్తి – స్వస్థ కుటుంబం – స్వస్థ బస్తీ” లక్ష్యాన్ని సాధించడమే ఆరోగ్య భారతీ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.

కార్యక్రమం విద్యార్థుల్లో విశేష స్పందన పొందింది.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *