చిలకలూరిపేటలోని విజ్ఞాన్ విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య భారతి చిలకలూరిపేట శాఖ ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు ఈరోజు శుభ్రంగా, భక్తి శ్రద్ధలతో ఆనందంగా నిర్వహించబడ్డాయి.

కార్యక్రమానికి ఆరోగ్య భారతి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి డాక్టర్ కాకాని పృధ్వీ రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు వారితో పాటు  గుంటూరు నుండి ఆరోగ్య భారతి కార్యకర్త శ్రీ సత్య సాయి విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఉద్యోగి పాల్గొన్నారు .

స్థానిక పెద్దలు శ్రీ శ్యామ్ మోహన్ రావు, శ్రీ రమేష్, శ్రీ సునీల్, శ్రీ సీతారామాంజనేయులు గారు పాల్గొని కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు.

వేడుకలు పుష్పమాల సమర్పణతో ప్రారంభమయ్యాయి. అనంతరం డాక్టర్ పృధ్వీ రాజు గారు ధన్వంతరి దేవుని ఆవిర్భావం, ఆయ‌న అందించిన వైద్య సేవలు, సుశ్రుతుని శిష్యునిగా చేర్చుకొని ఆయుర్వేద శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన విధానం గురించి విశదీకరించారు.

2002లో స్థాపించబడిన ఆరోగ్య భారతి ఇప్పటి వరకు సమాజ ఆరోగ్యాభివృద్ధి కోసం చేస్తున్న కీలక సేవలను, ముఖ్యంగా:

  • స్కూల్ హెల్త్ ప్రోగ్రాం
  • CPR శిక్షణ
  • ప్రథమ చికిత్స
  • గృహవైద్యం
  • యోగా
  • పర్యావరణ అవగాహన కార్యక్రమాలు

వంటి అనేక సేవా కార్యక్రమాలను వివరించారు.

ఆరోగ్యం అంటే కేవలం శరీరమే కాదు; మనసు, బుద్ధి, ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. మనసును నియంత్రించుకోలేకపోతే అనేక రుగ్మతలు వస్తాయని, అందువల్ల ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు.

చివరగా ప్రాణాయామం, ధ్యానం కార్యక్రమం నిర్వహించి, పాల్గొన్నవారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. త్వరలోనే చిలకలూరిపేటలో ఆరోగ్య భారతి ప్రత్యేక జట్టు ఏర్పాటుచేసి మరిన్ని ఆరోగ్య సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *