2025  నవంబర్ 25 వ తేదీ తమిళనాడు లోని క్రిష్ణగిరి జిల్లాలో గల అరింగర్ అన్నా ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఆరోగ్య భారతీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ప్రత్యేక ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆరోగ్య భారతీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మురళీ కృష్ణ జీ విచ్చేసి ఉపన్యాసం అందించారు.

ప్రిన్సిపల్ శ్రీ ధనపాల్ గారు ఆత్మీయ స్వాగతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డా. మురళీ కృష్ణ జీ “సంపూర్ణ ఆరోగ్యం అనేది కేవలం శరీరం మాత్రమే కాదు—మనసు, జీవనశైలి, ఆహార విధానం, నిద్ర, శ్వాస—all together makes healthy living” అని తెలియజేస్తూ విలువైన మార్గదర్శకత అందించారు.

డా. మురళీ కృష్ణ జీ అందించిన ముఖ్య సూచనలు:

  • ప్రతిరోజు 30 నిమిషాల వ్యాయామం తప్పనిసరి
  • ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారాలను దూరంగా ఉంచాలి
  • సత్వర శ్వాసాభ్యాసాలు, యోగా, ధ్యానం అలవర్చుకోవాలి
  • ఒత్తడి నియంత్రణకై రోజువారీ ధ్యానం అనుసరించాలి
  • శరీర గడియారానికి అనుగుణంగా సకాలంలో నిద్రపోవడం & లేవడం చాలా ముఖ్యము
  • ఆరోగ్యకరమైన జీవనశైలిని విద్యార్థులకు కూడా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని సూచించారు

ఈ కార్యక్రమంలో మొత్తం 42 మంది లెక్చరర్లు చురుకుగా పాల్గొని, అడిగిన ప్రశ్నలకు డా. మురళీ కృష్ణ జీ విలువైన సమాధానాలు ఇచ్చారు. ఆరోగ్య భారతీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న “స్వస్థ వ్యక్తి – స్వస్థ కుటుంబం – స్వస్థ సమాజం” భావనను వివరించి, విద్యాసంస్థల ద్వారా ఆరోగ్య సందేశం మరింత విస్తృతంగా చేరుతుందని అన్నారు.

కలేజీ అధ్యాపకులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రయోజనకరమని అభిప్రాయపడి, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని శిక్షణ కార్యక్రమాలను కోరారు.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *